ప్రేమ కోసమై - The Indic Lyrics Database

Prema kosamai

Lyricist - Pingali Nagendra Rao | Singer - Ghantasala | Music Director - Ghantasala | Movie - Paataalabhairavi | Year - 1951

Song link

View in native script

ప్రేమ కోసమై వలలో పడెనో పాపం పసివాడు...
అయ్యో  పాపం పసివాడు
వేమరు దేవుల వేడుకుని తన కొమరుని క్షేమం కోరుకుని
ఏమైనాడో - ఏమౌనోయని కుమిలే తల్లిని కుములుమనీ "ప్రేమ"
ప్రేమకన్ననూ పెన్నిధియేమని యేమిధనాలిక తెచ్చుననీ
భ్రమసి చూచు ఆ రాజకుమారిని
నిముసమె యుగముగా గడుపుమనీ "ప్రేమ"
ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకుని
ఏమివ్రాసెనో... అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమనీ  "ప్రేమ"