ఎటు చూసినా - The Indic Lyrics Database

ఎటు చూసినా

गीतकार - మల్లాది రామకృష్ణశాస్త్రి | गायक - పి. లీల | संगीत - అశ్వత్థామ | फ़िल्म - రేచుక్క | वर्ष - 1954

Song link

View in Roman

ఎటు చూసినా బూటకాలే - ఎవరాడినా నాటకాలే "3"
తలక్రిందుల మారి - కలికాలంలో
చెడిపోలేనివారూ - చేతకానివారే! "తలక్రిందుల"
అంటుంది నానా - నమ్మమంటూంది నానా! "అంటుంది"
రూకల సంచీ రొండిన గ్రుచ్చితే
రొమ్ము విరుపొచ్చిందా మొనగాడా
కరుకుందా - కాళ్ళకు కదనుందా
ఒరతీయని చురకత్తికి పదునుందా
మనలో కదనుందా పదునుందా

పాగా చుట్టావ్ పగడీ పెట్టావ్
వేషం కట్టావ్ మీసం మెలేశావ్ దొరకొడుకా
అడవుల్లొ పులికి ఆకలేసి నీ మీదికి ఒక దుముకు దుమికితే
నిలబడి కలబడతావా?
లాలించి లంచం పెడతావా - హోయ్ "నిలబడి"
ఆ... లేకలేక ఓపిక చేసుకు
రాకరాక రానే వచ్చావ్ గాని - ఏం లాభం! "లేకలేక"
మీ జగం కాదు - ఈ యుగం వేరు తాతా!
తరాల్ మారి సం - బరాల్ మీరినయ్ తాతా "మీ" "ఎటు చూసినా"