జయజయ మహదేవ - The Indic Lyrics Database

జయజయ మహదేవ

गीतकार - తోలేటి | गायक - ఘంటసాల | संगीत - సుదర్శనం | फ़िल्म - కాళహస్తి మహాత్మ్యం | वर्ष - 1954

Song link

View in Roman

జయజయ మహదేవ శంభోహర శంకరా

సత్య శివసుందరా నిత్య గంగాధరా

బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్

నిను వర్ణింపలేరన్న నేనెంతవాడన్

దయాసాగరా...

భీకరారణ్య మధ్యంబునన్ - బోయనైపుట్టి

పశుపక్షి సంతానముల్ కూల్చి బక్షించు పాపాత్ముడన్

విశ్వరూపా, మహామేరు చాపా

జగన్ సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాపా


 మహిన్ పంచభూతాత్మ నీవేకదా దేవదేవా శివా

పృధ్వి జలవాయురాకాశ తేజోవిలాసా మహేశా... ప్రభో...

రంగు బంగారు గంగాతరంగాల

రాజిల్లు, కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీ


శ్రీశైల మల్లేశ్వరా

కోటినదులందు సుస్నానముల్ చేయు

ఫలమిచ్చు క్షేత్రాన వశియించు

శ్రీరామలింగేశ్వరా శ్రీరామ


నిత్య గోదావరి నృత్యసంగీత

నీరాజనాలందు

ద్రాక్షారామవాసా భీమేశ్వరా... భీమేశ్వరా....

దివ్యఫల పుష్పసందోహ బృందార్చితానంద

భూలోక కైలాస శైలానవ శియించు

శ్రీకాళహస్తీశ్వర (2)

దేవ దేవా... ఆ...ఆ...ఆ....

నమస్తే, నమస్తే, నమస్తే నమ: