ఏంచేస్తే అది ఘనకార్యం - The Indic Lyrics Database

ఏంచేస్తే అది ఘనకార్యం

गीतकार - పింగళి నాగేంద్రరావు | गायक - పిఠాపురం నాగేశ్వర రావు | संगीत - ఘంటసాల | फ़िल्म - చంద్రహారం | वर्ष - 1953

Song link

View in Roman

ఒహూం ఒహూం హూం -

ఒహూం ఒహూం

ఏం చేస్తే అదే ఘనకార్యం

మనమేం చేస్తే అదే ఘనకార్యం

అదే ఘనకార్యం "ఒహూం"

నేను చెప్పినది నీకు తెలియక

నీవు చెప్పినది నాకు తెలియక

మనము చెప్పినది మనకే తెలియక

జిలిబిలి గిలిబిలి గలిబిలిగా "ఒహూం"

చెప్పేదెపుడూ చెప్పకుండగా

చేసే దెపుడూ చెప్పకుండగా

చెప్పి చేయునది ఒప్పకుండగా

గలిబిలి గిలిబిలి గలిబిలిగా "ఒహూం"

వాడి జట్టు ముడి వీడికి పెట్టి

వీడి జుట్టుముడి వాడికి పెట్టి

వాడు వీడు సిగపట్టు పట్టగా

గజిబిజి గిజిబిజి గడబిడగా "ఒహూం"