తానే మారినా - The Indic Lyrics Database

తానే మారినా

गीतकार - సముద్రాల సీనియర్ | गायक - రావు బాలసరస్వతి దేవి | संगीत - సి.ఆర్.సుబ్బరామన్ | फ़िल्म - దేవదాసు | वर्ष - 1953

Song link

View in Roman

తానే మారెనా  గుణమ్మే మారెనా 
దారీ తెన్నూ లేనే లేక ఈ తీరాయెనా "తానే"
తొలిచూపు నాటి రూపు మారే
ధోరణి మారె "తొలి చూపు"
నిలువెల్లా మెల్లనాయె నిట్టూర్పే తుదాయే
ఏదీ లేని పేదైపోయి ఈ తీరాయెనా 
వలపు తీరు ఈ తీరౌనా ...ఆ... "వలపు"
మా చెలిమి కలలో పెన్నిదేనా...ఆ...ఆ..ఆ

పెను చీకటైన జీవితానా వెల్గిన జ్యోతీ "తానే"
మధుపాయే మాసిపోగా అంతమ్మే ఫలమ్మా
ఏరి కోరు ఉల్లాసాలు ఈ తీరాయెనా తానే
నా సేవలకు ఇంతే వరమా... ఆ... "నా సేవ"

నాకిదే కడసారి దరిశనమా ....ఆ....ఆ...ఆ
అడియాస పాలు చేసినారు కోరినవార "అడియాస"
అడియాస పాలు చేసినారు కోరినవారు
మనసైనా చేరలేని ఈ దాసి ఇటాయే
గాలీ మేడ కూలీపోయి ఈ తీరాయెనా  "తానే"