అంతా బ్రాంతియేనా - The Indic Lyrics Database

అంతా బ్రాంతియేనా

गीतकार - సముద్రాల సీనియర్ | गायक - కె. రాణి | संगीत - సి.ఆర్.సుబ్బరామన్ | फ़िल्म - దేవదాసు | वर्ष - 1953

Song link

View in Roman

అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా

చిలిపితనాల చెలిమే మరచితివో..
చిలిపితనాల చెలిమే మరచితివో..
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
తల్లిదండ్రుల మాటే దట వెరచితివో
పేదరికమ్ము ప్రేమపథమ్ము మూసివేసినదా
నా ఆశే దోచినదా
అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా

మనసునలేని వారి సేవలతో
మనసునలేని వారి సేవలతో
మనసీయగలేని నీపై మమతలతో
మనసీయగలేని నీపై మమతలతో
వంతలపాలై చింతించే నా వంతా దేవదా
నా వంతా దేవదా

అంతా బ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశ నిరాశేనా మిగిలేది చింతేనా