गीतकार - సముద్రాల సీనియర్ | गायक - ఘంటసాల | संगीत - సి.ఆర్.సుబ్బరామన్ | फ़िल्म - దేవదాసు | वर्ष - 1953
View in Romanపల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి
ఆటపాటలందు కవ్వించు కొంటే కోణంగి
మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో
నగవేమో వగేమో కనులారా చూదము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో
నన్ను చూడగానే నిననాటి చనువు చూపేనో
నా దరికి దూకునో నా దరికి దూకునో
తానలిగి పోవునో ఏమౌనో చూదము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో
ప్రొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము
పల్లెకు పోదాం పారులు చూద్దాం చలో చలో
అల్లరి చేదాం చలో చలో