गीतकार - పింగళి నాగేంద్రరావు | गायक - ఘంటసాల, పి. లీల | संगीत - ఘంటసాల | फ़िल्म - పాతాళభైరవి | वर्ष - 1951
View in Romanఇందు : కలవరమాయే మదిలో - నా మదిలో -
కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయె
రాము: కలవరమాయే -మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయె
రాము : నాలో యేమొ నవరస రాగం - పిల్లనగ్రోవి ఊదిందీ
మోహాలేవో మోసులు వేసి - ఊహాగానము చేసి "కల"
ఇందు : కన్నులలోన కలలే ఆయే - మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
రాము : కలవరమాయే మదిలో నా మదిలో