జయహో... జయహో... - The Indic Lyrics Database

జయహో... జయహో...

गीतकार - సముద్రాల సీనియర్ | गायक - బృంద గాయనీ గాయకులు | संगीत - ఘంటసాల | फ़िल्म - మనదేశం | वर्ष - 1949

Song link

View in Roman

జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ
జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
జైబోలో జైబోలో బోలో బోలో జైబోలో
స్వతంత్ర భారత నరనారీ
పరాధీనతా బంధ విమోచన
మహాపర్వ మీ శుభదినమూ
అభంగ స్వేచ్ఛా రణాంగణములో
సాహసానికిది ఫలమూ
జయహో... జయహో...
మహాత్మగాంధీ జయ విజయీభవ భారతధాత్రీ
స్వతంత్ర మానవ జాతులలో
మన మాటకు విలువా...
మనకొక జెండా లభించె నేటికి
ఇక ఏనాటికి మనదే మనదే
మనదే మనదే మనదేశం...