ఎంత కృపామతివే - The Indic Lyrics Database

ఎంత కృపామతివే

गीतकार - తాపీ ధర్మారావు నాయుడు | गायक - ఘంటసాల,శ్రీదేవి | संगीत - ఘంటసాల | फ़िल्म - కీలుగుఱ్ఱం | वर्ष - 1949

Song link

View in Roman

ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...
ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...

చరణం : 1
కత్తివాదరకు బలిగానుండే
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
కన్యకు గూర్చితి కళ్యాణ మహా...
ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...

చరణం : 2
ఏదో పనిపై ఏగే వానికి...
ఏదో పనిపై ఏగే వానికి...
ఈ విద్యావతి ఈ మనోహారిణి
ఇచ్చి నన్ను కరుణించితివా... హహ...
ఎంత కృపామతివే భవాని...
ఎంత దయానిధివే...

చరణం : 3
నూతనముగా ఈ లేత మారుతము
నూతనముగా ఈ లేత మారుతము
గీతా గానము చేయుగదా...
హృదయ తంత్రులను కదలించుటచే
హృదయ తంత్రులను కదలించుటచే
వదలిన గానమో... ఏమో...
వదలిన గానమో... ఏమో...
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...
ప్రణయ దేవతలు పాడుచు నుండే సామ గానమే ఏమో...
సామ గానమేమో...