కాదు సుమా - The Indic Lyrics Database

కాదు సుమా

गीतकार - తాపీ ధర్మారావు నాయుడు | गायक - ఘంటసాల | संगीत - ఘంటసాల | फ़िल्म - కీలుగుఱ్ఱం | वर्ष - 1949

Song link

View in Roman

కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా
అమృత పానమును అమర గానమును
అమృత పానమును అమర గానమును
గగన యానమును కల్గినట్లుగా
గాలినితేలుచూ సోలిపోవుటిది
కాదు సుమా కల కాదు సుమా

చరణం : 1
ప్రేమలు పూచే సీమల లోపల
ప్రేమలు పూచే సీమల లోపల
వలపులు పారే సెలయేరులలో
తే టి పాటలను తేలియాడితిని
కాదు సుమా కల కాదు సుమా

చరణం : 2
కన్నె తారకల కలగానముతో
కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ... ఓ... ఓహో... ఓ... ఓ... ఒహో...
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఉత్సాహముతో ఊగుచుండుటిది
కాదు సుమా కల కాదు సుమా

చరణం : 3
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
పూల వాసనల గాలి తెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో
ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...
దోబూచులాడుటిది
కాదు సుమా కల కాదు సుమా
కాదు సుమా కల కాదు సుమా